శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో శుక్రవారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేశారు. ఆర్జీకేలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. యూజీడీ పైపులైన్ పనులు చేయించడం జరిగిందన్నారు. అదేవిధంగా నూతనంగా నిర్మిస్తున్న మార్కండేయ, సాయిబాబా, పోచమ్మ దేవాలయం పనులను పరిశీలించారు. ఆయన వెంట వార్డు మెంబర్ శ్రీకళ, నాయకులు వెంకటేశ్వర్లు, తిరుపతి, భాగ్యలక్ష్మీ, ఝాన్సీ తదితరులు ఉన్నారు.