– గౌతమి నగర్ పార్క్ ప్రహరి పనులను పరిశీలించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ గౌతమినగర్ లో జీహెచ్ఎంసీ ల్యాండ్ ప్రోటెక్షన్ సెల్ ద్వారా 9 లక్షల నిధులతో మంజూరైన పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులను ఈవీడీఎం ఇంజనీరింగ్ డి ఈ సందీప్ ఏఈ సంతోష్ లతో కలిసి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి బుదవారం పరిశీలించారు. సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా ఉన్న పార్క్ ఆక్రమణ సమస్యకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ 1800 599 0099 కాలనీ వాసులు ద్వారా పిర్యాదు అందుకున్న అధికారులు తక్షణమే చర్యలు చెప్పట్టి గౌతమి నగర్ కాలనీ పార్క్ ను ఆక్రమణ నుండి కాపాడి అత్యవసరంగా 9 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఐరన్ గ్రిల్స్ తో కాంపౌండ్ వాల్ నిర్మించడం అభినందనీయమన్నారు. చందానగర్ డివిజన్ లో ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా కాపాడిన మొట్టమొదటి పార్క్ గౌతమి నగర్ పార్క్ అని, ఇట్టి పార్క్ కాంపౌండ్ వాల్ పనులను పూర్తి చేసి, త్వరలో పార్క్ గా అభివృద్ధి చేస్తాం అని, డివిజన్ లో మరి కొన్ని ఆక్రమణలకు గురైన పార్కులకు కూడా కాంపౌండ్ వాల్ నిర్ముస్తామని అన్నారు. కాలనీ వాసులు వారి వారి లే ఔట్ లో ఉన్న బల్దియకి సంబంధించిన పార్కులు, ఓపెన్ స్పేస్ లు మరియు స్మశాన వాటికలు ఆక్రమణ గురవుతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కి పిర్యాదు చేయాలని నవతారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ సలహాదారు కసిరెడ్డి భాస్కరరెడ్డి, అధ్యక్షుడు నూనె సురేందర్ తదితరులు పాల్గొన్నారు.