ఘనంగా గచ్చిబౌలి కార్పొరేటర్ కార్యాలయంలో మహిళా దినోత్సవ సంబరాలు – మహిళలను సన్మానించిన నేతలు

నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ రంగాల్లో రాణిస్తున్న సుమారు 100 మంది మహిళలను ఘనంగా సన్మానించి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో లింగ భేదం చూపించకూడదనే ఉద్దేశంతో మెరుగైన సమాజాన్ని రూపొందించేందుకు కలిసి కట్టుగా కృషి చేయాలని అన్నారు. మహిళల పట్ల ఎలాంటి వివక్షత చూపకుండా మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల పట్ల జరిగే వివక్షతను బద్దలు కొడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, సీనియర్ నాయకురాలు వరలక్ష్మి, ఇందిరా రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి. విఠల్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు శివ సింగ్, హరీష్ శంకర్ యాదవ్, కిషన్ గౌలి, నర్సింగ్ నాయక్, ప్రసాద్, రంగస్వామి ముదిరాజ్, దుర్గరామ్, కృష్ణ, శ్రీను, రాజు, నర్సింగ్ రావు, గంగాధర్, నరేందర్, జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏ కృష్ణ, భరత్, రఘు, రాందాస్, శ్రీనివాస్, రాజేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు సన్మానిస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here