నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్ క్లేవ్ కాలనీలలో స్థానికులతో కలిసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సోమవారం పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్ క్లేవ్ కాలనీలో అసంపూర్తిగా మిగిలిన పనులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కరెంట్ స్తంభాల సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని చెప్పారు. రాజకీయలకతీతంగా అభివృద్ధి చేశామని, రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి సమస్య లేకుండా చూశామన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్, టీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ ఖాజా, రాంప్రసాద్, హనుమయ్య చౌదరి, స్వామి, రాజేంద్ర ప్రసాద్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.