నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ రామకృష్ణ నగర్ లో బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జీ గజ్జల యోగానంద్ బస్తీ పర్యటన చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ స్తంబాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, జీహెచ్ఎంసీ బోర్ వాటర్ సంబంధించిన పైపులైన్లు రోడ్లు వేయడం ద్వారా ధ్వంసం అయ్యాయని, రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ చేసేలా చూడాలని తదితర సమస్యల గురించి కాలనీ వాసులు బిజెపి నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గజ్జల యోగానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు ఏకాంత్ గౌడ్, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి అశోక్, జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, దయాకర్ రెడ్డి, జితేందర్, బాను యాదవ్, యాదగిరి, సంతోష్,వినోద్, నరహరి, రమేష్, రాజు, గణేష్, సంధ్య, మంజుల, ఉపేంద్ర, శాలిని, యాకయ్య, రవి, మురళి గౌడ్, శ్రవణ్ గౌడ్, బస్తీవాసులు, బిజెపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.