నమస్తే శేరిలింగంపల్లి: బ్రిటీష్ పాలకుల నుంచి విముక్తి కల్పించి యావత్ భారతావనికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చిన అహింసావాది మహాత్మ గాంధీజీ అని బిజెవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్ అన్నారు. మహాత్మ గాంధీ వర్థంతిని పురస్కరించుకుని సిద్దిక్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి రఘునాథ్ యాదవ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వాతంత్ర్య సాధనలో గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, చందు, రవి, నరేష్, సుధాకర్, వెంకటేష్, శీను తదితరులు పాల్గొన్నారు.