నమస్తే శేరిలింగంపల్లి: పేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ని ఎల్లప్పుడూ కొనసాగించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. అత్యవసర చికిత్స కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులు మంజూరయ్యాయి. 11 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 8.18 లక్షల చెక్కులను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ గారు పునరుద్గాటించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం కొనసాగే పథకం అని అన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా సీఎంఆర్ఎఫ్ ఆదుకుంటుందని చెప్పారు. అనారోగ్యానికి, ఏదైనా ప్రమాదానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గణేష్ ముదిరాజ్, చంద్రారెడ్డి , బ్రిక్ శ్రీను, కాశీనాథ్ యాదవ్, శ్రీనివాస్ చౌదరీ, పోశెట్టి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.