హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ, జనప్రియ 3వ ఫేజ్‌లలో తెరాస నాయకుడు వాలా హరీష్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పాల్గొని పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్ గౌడ్, జనార్దన్, బాబు మోహన్ మల్లేష్, రవి, మనోజ్, నవీన్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్, సంజు, జనప్రియ 3వ ఫేజ్ వాసులు సుధాకర్, గవాస్కర్, పూర్ణచందర్, నాయుడు, రాకేష్, విక్రం తదితరులు పాల్గొన్నారు.