నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉండాలని, భగవద్గీత పుస్తకం పఠనంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఇంట్లో భవద్గీత ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి భవద్గీత ఇచ్చేలా ప్రతి ఇంట్లో భగవద్గీత కార్యక్రమాన్ని మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, డివిజన్ సెక్రటరీలు దయాకర్ రెడ్డి, జితేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.