నమస్తే శేరిలింగంపల్లి: ఆంగ్ల నూతన సంవత్సరం 2022 ను పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు, రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. షేక్ పేట్ ప్లై ఓవర్ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 2022 సంవత్సరంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి మరింత సహకరించాలని ఆకాంక్షించారు.