నమస్తే శేరిలింగంపల్లి: రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ చౌరాస్తా కూడలిలో స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించిన అనంతరం దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తోందని అన్నారు. తెలంగాణ రైతు ప్రయోజనాలు దెబ్బ తీసేలా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, షేక్ చాంద్ పాషా, జంగం గౌడ్, రూపారెడ్డి, శ్రీనివాస్ చౌదరి, రవి శంకర్ నాయక్, బలరాం యాదవ్, రజనీకాంత్, భీమని శ్రీనివాస్, కాశెట్టి అంజి, పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకటి,సిద్దిఖ్ నగర్ ప్రెసిడెంట్ బసవ రాజు, ఉప్పు శ్రీనివాస్, మధు ముదిరాజ్, తిరుపతి రెడ్డి, చారీ, సత్యం గౌడ్, తిరుపతి యాదవ్, వివిరావు, విజయ్ కుమార్, సాగర్, అశోక్ సాగర్, కలీం, లక్ష్మి నారాయణ, కుమార్, లక్ష్మణ్, మొహ్మ్మద్ ఖాసీం, గిరి గౌడ్, యాదగిరి, నరేష్ ముదిరాజ్, సర్ధాజ్, యూత్ నాయకులు దీపక్, కరీం, వసీమ్, అక్షయ్ అభి, సిద్ధు, నరేష్, ముక్తార్, జహంగీర్, సాయి సాగర్, జుబేర్, ఇర్ఫాన్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.