బిజెపి‌ నాయకుల జోలికి వస్తే సహించేది లేదు – మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి నాయకుల జోలికి వస్తే సహించేది లేదని బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి హెచ్చరించారు. కేరళలో బిజెపి నాయకులు, అడ్వకేట్ రంజిత్ శ్రీనివాసన్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ కేరళ ప్రభుత్వం అసమర్థ వైఖరికి నిరసనగా కూకట్‌పల్లి వై జంక్షన్ లో మేడ్చల్ అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పినరయి విజయన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ రంజిత్ శ్రీనివాస్ ను హత్య చేసిన గూండాలకు వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

కేరళలో బిజెపి నాయకుని హత్యను నిరసిస్తూ కూకట్‌పల్లి వై జంక్షన్ లో ధర్నా చేపట్టిన బిజెపి నాయకులు

తెలంగాణ రాష్ట్రంలోనూ బిజెపి నాయకుల పై దాడులు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం చూస్తుంటే తెలంగాణలో ఎంత అరాచక పాలన సాగుతుందో అధికార పార్టీ నాయకులు ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థమవుతోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల హక్కు అని తెలంగాణలో మాత్రం ప్రశ్నిస్తే దాడులు, తప్పుడు కేసులతో జైల్లో పెట్టడం పరిపాటిగా మారిందని వాపోయారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడులకు, తప్పుడు కేసులకు భయపడరని, అన్యాయాన్ని ఎదిరించడం లో ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మూసాపేట్ కార్పొరేటర్ కోడిచర్ల మహేందర్, ఓబీసీ మోర్చా నాయకులు శ్రీనివాస్ గౌడ్, పర్వతాలు యాదవ్, కిషోర్, కుమార్, దుర్గాప్రసాద్, ఏకాంత్ గౌడ్, సమ్మయ్య, ఎత్తారి రమేష్, నర్సింగ్ రావు, రేపన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

పినరయి విజయన్ దిష్టిబొమను దగ్ధం చేస్తున్న బిజెపి నాయకులు

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here