నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని వరి ధాన్యం ఒక్క గింజా కొనబోమని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి ప్రకటించి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనగా సీఎం కెసిఆర్ పిలుపు మేరకు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గుల్ మోహర్ పార్క్ కూడలి వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటుందా లేదా అనే విషయంపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, డివిజన్ సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, బస్తి కమిటీ నాయకులు, మహిళ కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.