హక్కుల సాధనకు సంఘటితంగా పోరాడాలి – తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర

నమస్తే శేరిలింగంపల్లి: రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. కేవలం ధన బలం, జన బలం ఉన్న వర్గాలకే రాజకీయ పార్టీలు,ప్రభుత్వాలు ప్రాధాన్యత నిస్తున్నాయని అన్నారు. సమాజంలో ఇతర వర్గాలతో సమానంగా, గౌరవంగా జీవించడం కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. సగరులు సంఘటిత శక్తితో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని సంఘాలు జిల్లాలలో మరింత సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర

అనంతరం ములుగు జిల్లా సగర సంఘం అధ్యక్షులుగా కొడిపాక రవి సగరను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సగర సంఘం నూతన కార్యవర్గంతో పాటు అనుబంధ కమిటీలు మహిళా సంఘం, యువజన సంఘం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులుగా కొడిపాక రవి సగర, ప్రధాన కార్యదర్శిగా కురిమిళ్ల మహేందర్ సగర, కోశాధికారిగా నరసింహారావు సగర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలుగా అనిశెట్టి స్వరూప సగర, ప్రధాన కార్యదర్శిగా అనిశెట్టి రజిని సగర, కోశాధికారిగా చిదురాల సరిత సగర, జిల్లా యువజన సంఘం అధ్యక్షులుగా చిన్ కుమార్ సగర, ప్రధాన కార్యదర్శిగా సోమ వంశీ సగర, కోశాధికారిగా గోవిందరావు సగర లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంఘం ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి నలుబాల బిక్షపతి సగర, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు మహేశ్వరి సగర, ప్రధాన కార్యదర్శి స్రవంతి సగర, రాష్ట్ర మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు సత్య సగర, సంయుక్త కార్యదర్శి కీర్తి కోటేశ్వర్ సగర, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు పెద్ద బుద్ధుల సతీష్ సగర, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మర్క సతీష్ సగర, రాష్ట్ర నాయకులు కోటేశ్వర్ సగర, జంగాలపల్లి మాజీ సర్పంచ్ నలబోలు శ్రీధర్ సగర తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న ములుగు జిల్లా సగర సంఘం నూతన కార్యవర్గం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here