నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సనాతన కల్చరల్ సంస్థ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యప్రదర్శనలు నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు నవీన్ కుమార్ పర్యవేక్షణలో చింత నాగ జ్యోతి, ప్రవీణ, శ్రీరాజ్, రచ్చ నరేష్, రాధా వర్మ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆనంద నర్తన గణపతిమ్, శివతాండవం, ముద్దుగారేయ్ యశోద, అన్నమాచార్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, జానపద నృత్యాలు ప్రదర్శించారు. కళాకారులందరికి సనాతన కల్చరల్ సంస్థ అధ్యక్షుడు నవీన్ కుమార్ ప్రశంసా పత్రాలు ఇచ్చి ప్రోత్సహించారు.
