నమస్తే శేరిలింగంపల్లి: ఆపదలో ఉన్న వారికి లయన్స్ క్లబ్ హైదరాబాద్ హోప్ అండగా నిలుస్తుందని లయన్స్ క్లబ్ హైదరాబాద్ హోప్ అధ్యక్షుడు కొండా విజయ్ పేర్కొన్నారు. అనారోగ్యంతో బాదపడుతూ అసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 సంవత్సరాల చిన్నారి ఉషోదయ చికిత్స నిమిత్తం లయన్స్ క్లబ్ హైదరాబాద్ హోప్ బాసటగా నిలిచింది. ఆదివారం చందానగర్ హుడాకాలనీ లో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారి ఉషోదయ తండ్రి సురేష్ కుమార్ కు రూ. 10 వేల రుపాయల చెక్కును అధ్యక్షుడు కొండా విజయ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ హైదారాబాద్ హోప్ ఆధ్యక్షుడు కొండా విజయ్ మాట్లాడుతూ తమ సభ్యుల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ మారం వేంకటేశ్వర్లు గుప్తా, భీంరావు, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, శాంతి భూషణ్ రెడ్డి, నూకల సందీప్, మారం ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
