నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్ 1లో పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. పాదయాత్రలో కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడికి కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. డ్రైనేజీ, మంచి నీరు , రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబందిత సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, పొడుగు రాంబాబు, కొండల్ రెడ్డి, ఎండీ ఇబ్రహీం, కృష్ణ యాదవ్, కాశినాథ్ యాదవ్, రమేష్, వేణుగోపాల్, రమణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.