దివ్యాంగుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న పథకాలు : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వికలాంగులకు ప్రభుత్వ విప్, శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ దివ్యాంగుల సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల‌ కోసం రూ. 3,016 పింఛన్ ఇస్తూ దేశంలోనే అగ్రభాగంలో ఉందన్నారు. దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్లు, చేతికర్రలు, త్రీవీలర్ స్కూటీలను అందించడం జరుగుతుందని అన్నారు. దివ్యాంగుల‌ కోసం కృత్రిమ కాళ్లు, చేతులు తయారు చేసే యూనిట్ తో హైదరాబాద్ లో అతిపెద్ద పార్క్ ను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగుల సంక్షేమ అభివృద్ధి పథకాల వల్ల 2018, 2019 సంవత్సరాలలో కేంద్రం దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణను అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి అవార్డులు ఇచ్చిందన్నారు. వీటితో పాటు భవిష్యత్ లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here