నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి మార్గంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్ సీ యూ బస్సు డిపో మేనేజర్ శ్రీనివాస్ ను బిజెపి నాయకులు కలిసి విన్నవించారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్ మార్గంలో బస్సు సౌకర్యం లేక రోగులు, ప్రజలు, హాస్పిటల్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని రవికుమార్ యాదవ్ అన్నారు. లింగంపల్లి వైపు వెళ్లే బస్సులను కొండాపూర్ ఏరియా ఆస్పత్రి వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు బస్సులను కేటాయించాలని కోరుతూ హెచ్ సీ యూ బస్సు డిపో మేనేజర్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. అందుకు మేనేజర్ సానుకులంగా స్పందించి కొండాపూర్ హాస్పిటల్ ఏరియా లో పరిశీలించి ఆర్టీసీ బస్సులు తిరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు.