నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ ప్రభుత్వం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్ల పై బడిన వారు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నూతన ఓటర్ కార్డ్ ను నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో ఏవైనా తప్పు ఒప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని అన్నారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, జిల్లా ఓబీసీ నాయకులు రవి గౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.