నమస్తే శేరిలింగంపల్లి: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజ్ అన్నారు. మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో బీజేపీ ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ అధ్యక్షతన మహాత్మ జ్యోతి రావు పూలే వర్థంతిని నిర్వహించారు. ఆలే భాస్కర్ రాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, నాయకులు, తండా వాసులతో కలసి పూలే చిత్ర పట్టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ మియాపూర్ డివిజన్ ఆధ్వర్యంలో మియాపూర్ బస్ స్టాప్ వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు అని అన్నారు. ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శం అని చెప్పారు. పూలే విద్య, వివక్ష, పేదరికం, ఆర్థిక, అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాణిక్ రావు, అనిల్ గౌడ్, రాఘవేంద్రరావు, చందు, ఆంజనేయలు, రవి గౌడ్, శ్రీధర్ రావు, లక్ష్మణ్, తండా అధ్యక్షులు తిరుపతి, ప్రధాన కార్యదర్శి రత్నకుమార్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.