నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్శితులై యువకులు గులాబీ పార్టీ వైపు చూస్తున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో చందానగర్ బిజెపి పార్టీకి చెందిన పలువురు యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గులాబీ కండువా కప్పి సాదరంగా టీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు.
ప్రతి పేద కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకం వర్తిస్తుందన్నారు. పుట్టబోయే బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకం ద్వారా లబ్దిపొందుతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ వైపు అన్ని పార్టీల నాయకులు ఆకర్శితులై టీఆర్ఎస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, మాజీ కార్పొరేటర్ రంగరావు తెరాస నాయకులు గురుచరణ్ దుబే, రవీందర్ రెడ్డి , హరీష్ దామోదర్ రెడ్డి పాల్గొనగా బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన వారిలో అమిత్ దుబే, చరణ్, ఆశిష్ దుబే, మనీష్, ప్రీతమ్ రెడ్డి, సోను, విజయ్, అభిలాశ్, తరుణ్, కార్తిక్, వెంకట్, రాకేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.