పెరిగిన నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా వంటావార్పుతో యువజన కాంగ్రెస్ నిరసన

నమస్తే శేరిలింగంపల్లి:యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ నాయకులు బి సౌదర్య రాజన్ ఆధ్వర్యంలో పెరిగిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా శనివారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. యువజన కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు మహిపాల్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం వచ్చి ఏడు సంవత్సరాలు గడిచిన సామాన్యుల బ్రతుకులు ఎం మారలేదన్నారు. ఎన్నికలప్పుడు మోడీ సామాన్యుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏళ్లు గడిచిన సామాన్యులకి న్యాయం జరగలేదన్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ బిజెపి ప్రభుత్వం పేదలని నిత్యం మోసం చేస్తుందన్నారు. పెరిగిన పెట్రోల్, డిజిల్, వంట గ్యాస్ ధరలని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సౌదర్య రాజన్ మాట్లాడుతూ పెట్రోల్, డిజిల్, వంట గ్యాస్ ధరలని పెంచటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి విడనాడి ప్రజలపై పడుతున్న భారన్ని వెంటనే తగ్గించాలన్నారు. లేనిపక్షంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీహరి గౌడ్ , ముషర్రాఫ్, మందుల సైదులు, సందీప్ రెడ్డి, రాజేష్ గౌడ్, దుర్గ దాస్, సాయి కిషోర్, అజీముద్దీన్, ఖాజా, అసద్, కరీం, శ్రీకాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

వంటావార్పుతో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here