నమస్తే శేరిలింగంపల్లి:ప్రపంచమంతా పూలతో దేవుళ్లను పూజిస్తారు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పూలనే దేవతగా పూజించే ఘన చరిత్ర మనకు దక్కడం అదృష్టకరమని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి, గోపనపల్లి తండా, ఎన్టీఆర్ నగర్ లలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో పూల తో దేవుడిని పూజిస్తారు కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆ పూల నే దేవత గా పూజించే ఘన చరిత్ర మన తెలంగాణ ప్రత్యేకమని పేర్కొన్నారు. తెలంగాణ ఆచార, సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ అని అన్నారు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మను ఆడపడుచులు ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు, చిన్నారులు బిజెపి నాయకులు, స్థానిక నేతలు, బస్తి వాసులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.