తారానగర్ తుల్జాభవాని మాతను దర్శించుకున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు గొంగిడి సునీత పేర్కొన్నారు. శేరిలింగంపల్లి తారానగర్ తుల్జా భవాని దేవాలయం కమిటీ ఆహ్వానం మేరకు గురువారం దేవాలయాన్ని ఎమ్మెల్యే గోంగడి సునీత సందర్శించారు. ఎమ్మెల్యే సునీతతో పాటు చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి పాల్గొని తుల్జాభవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతను సన్మానిస్తున్న తుల్జాభవాని ఆలయ కమిటీ సభ్యులు

ఈ సందర్భంగా గొంగిడి సునీత మాట్లాడుతూ దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా తుల్జాభవాని మాతను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు పడుతున్నారని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, కార్పొరేటర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తుల్జా భవాని దేవాలయ కమిటీ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు జనార్ధన్ రెడ్డి, లక్ష్మి నారాయణ గౌడ్, గురుచరణ్ దుబే, మల్లేష్ గుప్త, ధనలక్ష్మి, హరీష్, రాజశేఖర్, వరలక్ష్మీ, పార్వతి, భవాని చౌదరి తదితరులు పాల్గొన్నారు.

తుల్జాభవాని ఆలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే గొంగిడి సునీత
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here