ఐవీఎఫ్ ఆధ్వర్యంలో జమ్మిమొక్కను నాటిన రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గ్రామంలో ఒక జమ్మి చెట్టు, దేవాలయంలో ఒక జమ్మి వృక్షం నాటే కార్యక్రమం గొప్ప విషయమ‌ని టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు పబ్బ మల్లేష్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట వేణుగోపాల స్వామి ఆలయంలో, గౌతమి నగర్ లో‌ని ఫ్రెండ్స్ కాలనీలో జమ్మి మొక్కలను రఘునాథ్ రెడ్డి నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేపట్టడం అభినందనీయమని అన్నారు. మొక్కలను నాటే మహాయజ్ఞాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో 1100 దేవాలయాల్లో 1100 జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమానికి పూనుకోవడం సంతోషకరమని రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ గుప్తా, బూరుగు జయ కృష్ణ గుప్తా, నాగరాజు గుప్తా, కైలాష్ సుధీర్ గుప్తా, సత్యనారాయణ గుప్తా, , శరత్ కుమార్ గుప్తా, దారం ప్రదీప్ కుమార్ గుప్తా, చందానగర్ ఐవీఎఫ్ అధ్యక్షుడు కోటేశ్వరరావు గుప్తా, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మినారాయణ గౌడ్, జనార్ధన్ రెడ్డి, గురు చరణ్ దూబే,‌ఓ.వేంకటేష్, గుడ్ల ధనలక్ష్మి, అక్బర్ ఖాన్, దాసు, వరలక్ష్మి, హరిత తదితరులు పాల్గొన్నారు.

జమ్మి మొక్కను నాటుతున్న రఘునాథ్ రెడ్టి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here