నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాష్ నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ అధికారులు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా కైలాష్ నగర్ కాలనీలో పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత విషయంలో కాలనీవాసులను జీహెచ్ఎంసీ అధికారులు అభినందించారు. సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ కార్తిక్ ఆధ్వర్యంలో కైలాష్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ గౌరవ అధ్యక్షుడు బొబ్బ దామోదర రెడ్డి, అధ్యక్షులు యాతం మల్లికార్జున రావు, ఉపాధ్యక్షులు ఎల్. కృష్ణ మూర్తి, ప్రధాన కార్యదర్శి సుధాకర్, కోశాధికారి షడాక్షరీ, కార్యదర్శులు కె.నాగేశ్వర్ రావు, కె. అగ్నేశ్వర్ రెడ్డి, ఎం.శివశంకర్, మౌనిక, కవిత రెడ్డి లను ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రం అందజేశారు.