నమస్తే, శేరిలింగంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నియంతృత్వ చట్టాలపై భగత్ సింగ్ ఆశయ స్ఫూర్తితో పోరాడాలని ఏఐఎఫ్ డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ అన్నారు. మియాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రోడ్ లో నిర్వహించిన భగత్ సింగ్ 114వ జయంతి కార్యక్రమంలో వనం సుధాకర్ హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం సరికాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తోందని ఉద్యోగాల భర్తీ చేయకుండా వాగ్దానాలతో కాలయాపన చేస్తోందని అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం లో విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో లేదని, నిరుద్యోగం అవినీతి దోపిడి జరుగుతోందని అన్నారు. యువత విభాగం నాయకురాలు సుల్తాన్ బేగం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డీ వై రాష్ట్ర ఉపాధ్యక్షులు వి తుకారం నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ప్రధాన కార్యదర్శి పి. శ్యాంసుందర్, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు డి. మధుసూదన్, శ్రీనివాసులు, రాజు, భూసాని రవి, నాయకురాలు విమల, లావణ్య, రజియా బేగం, షరీష్ రాంచందర్, మహేందర్, దుర్గాప్రసాద్, స్టాలిన్, సాగర్, భార్గవి తదితరులు పాల్గొన్నారు.