కార్మిక చట్టాల రద్దు సరికాదు: భారత్ బంద్ లో‌‌ ఏఐటీసీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్

నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎంసీపీఐయూ, ఏఐసీటీయూ, ఏఐఎఫ్‌డీ డబ్ల్యు,‌‌ ఏఐఎఫ్ డీ వై, ఏఐఎఫ్ డీ ఎస్ ఆధ్వర్యంలో సోమవారం మియాపూర్ అల్విన్ కాలనీ చౌరస్తాలో‌ బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. బంద్ లో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం (ఏఐసీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల ఉద్యోగులు, కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం సరికాదన్నారు. కార్మికులకు మేలు చేస్తామని వాగ్దానం చేసిన మోడీ అధికారంలోకి రాగానే కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేయడం దారుణమని అన్నారు, 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా చేసి కార్మికులకు తీరని నష్టం చేస్తున్నారన్నారు. బ్యాంక్, ఎల్ఐసి, రైల్వే, రక్షణ, అంతరిక్ష, నావి, ఎయిర్ ఫోర్ట్స్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలలో విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు వాటాలు ఇస్తూ ప్రైవేటికరిస్తూ, ప్రభుత్వ రంగాన్ని లేకుండా చేసే కుట్రలు చేస్తున్నారని‌ వాపోయారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతులకు, సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్టారు. ఇప్పటికైనా రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి రైతు, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో నాయకులు కె. రాజు, కే. వెంకటేష్, యం.‌ చందర్, ఇందిరా, లలిత, రజియా బేగం, ఏ .పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here