టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు: కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ లో ప్రతి ఒక్కరికీ పదవులు లభిస్తాయని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని అల్విన్ కాలనీలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అధ్యక్షతన టీఆర్ఎస్ బస్తీ కమిటీలను నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ‌కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి బస్తీలో టీఆర్ఎస్ కమిటీలను వేయడం జరుగుతుందని అన్నారు. పార్టీ కార్యకర్తలు పార్టీకి కట్టుబడి పనిచేయాలన్నారు. అనంతరం అల్విన్ కాలనీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, నాయకులు కృష్ణ ముదిరాజ్, లక్ష్మా రెడ్డి, రవీందర్ రెడ్డితో కలిసి నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఆల్విన్ కాలనీ బస్తి కమిటీ అధ్యక్షునిగా అర్.కిషన్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సి.హెచ్.మల్లేష్, బి. విఘ్నేశ్వర రెడ్డి, కన్వీనర్ జీ.శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు కె. రాజధర్మా రెడ్డి, ఆర్.రాజేశ్వర రావు, పి.లక్ష్మయ్య, మధు గౌడ్, జనరల్ సెక్రెటరీ జె. శ్రీనివాస్, బి.అర్జున్, జాయింట్ సెక్రటరీ జే.రాజేశ్వర్ రావు, ఈ.రవీందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి.ఎన్ స్వామి, శ్రీరాములు యాదవ్, కల్చరల్ సెక్రెటరీ సింహాద్రి, సంజీవ్ రెడ్డి, పబ్లిసిటీ సెక్రెటరీ సాంబశివ రెడ్డి, నర్సింహులు, ట్రెజరర్ సుదర్శన్ రాజు, సభ్యులుగా ఎన్.కమలాకర్, అర్.ప్రవీణ్ కుమార్, టి.చంద్రమోహన్ సింగ్, రాజ రామేశ్వర రెడ్డి,‌ ఎస్.కుమార స్వామి, వై.ఎస్.బాలకృష్ణ ను నియమించారు.

అల్విన్ కాలనీలో‌ టీఆర్ఎస్ బస్తీ కమిటీ సభ్యులతో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here