చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ కాలనీ(నార్త్) లో రూ.20 లక్షల GHMC నిధులతో చేపట్టిన సీసీ రోడ్ పనులను అర్ధరాత్రి కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజీ, తాగు నీటి పైప్ లైన్ వేయడం వల్ల రోడ్డు గుంతలుగా మారిందని అన్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారని, అందుకనే సీసీ రోడ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేసి స్థానికులకు రోడ్డును అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆమె వెంట కాలనీ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, నర్సింహ రెడ్డి, సంగప్ప, సంపత్ తదితర కాలనీ వాసులు ఉన్నారు.