గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని గచ్చిబౌలి డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు మట్ట సురేష్ ఆరోపించారు. గురువారం ఆయన డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లిలో పర్యటించారు. స్థానికంగా తాగునీటి పైప్లైన్లలో కాలుష్యభరితమైన నీరు వస్తుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించి పైప్‌లైన్‌ను పరిశీలించారు. అలాగే డ్రైనేజీ సమస్యను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం గ్రేటర్లో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.67వేల కోట్లు వెచ్చించామని తెలిపిందని, కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరో విధంగా ఉందని అన్నారు. అంత డబ్బును దేని కోసం ఖర్చు చేశారో చెప్పాలన్నారు. గ్రేటర్లో బీజేపీని గెలిపిస్తే ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.