నమస్తే శేరిలింగంపల్లి:చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీనగర్ కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎస్.ఎన్.రెడ్డి ఎన్నికవగా ఉపాధ్యక్షులుగా జి. శ్రీనివాస్ గౌడ్, పి.మల్లికార్జున్ యాదవ్, గౌరవ అధ్యక్షులుగా ఆర్.అంజిరెడ్డి, జి. జనార్దన్ రెడ్డి, కార్యదర్శిగా వి.రామారావు, కోశాధికారిగా యు.రాములు, వినాయక కమిటీ చైర్మన్ జి.రామ స్వామి గౌడ్ ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కమిటీని టీఆర్ఎస్ పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.