నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి టీ ఎన్ జి ఓ కార్యాలయం లో బీసీ జాక్ సమావేశం బుధవారం జరిగింది. కస్తూరి గోపాలకృష్ణ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీలకు రాజ్యాధికారం కోసం ఉద్యమం చేయాలని నిర్ణయించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, రాజకీయంగా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని పలువురు బీసీ నాయకులు వాపోయారు. అసెంబ్లీలో బీసీలకు 72 సీట్లు కావాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ లను కలుపుకొని అధికారం చేపట్టాలని తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. రంగారెడ్డి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్, లక్ష్మణ్, తెలంగాణ ఫోరం అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, నాగేశ్వరరావు, రాజబాబు, గంగపుత్ర మధుకర్, ఆచారి, వెంకన్న, అన్ని కులాల బీసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.