చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గంగారం పరిసర ప్రాంతాల వాసులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్న డ్రైనేజీ సమస్యను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దగ్గరుండి తాత్కాలికంగా పరిష్కరించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ ఎనక్లేవ్ నుండి గంగారాం వరకు గల డ్రైనేజి పైప్ లైన్లలో తలెత్తిన డ్రైనేజీ సమస్యను బల్దియా, జలమండలి అధికారుల తో కలిసి బుదవారం ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజి సమస్య సమాచారం తెలియగానే సంఘటన స్థలాన్ని పరిశీలించి, డ్రైనేజి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. పీజేఆర్ ఎనక్లేవ్ నుండి గంగారాం వరకు ప్రతి మ్యాన్ హోల్ ను బకెట్ తో శుభ్రం చేస్తూ, ఎయిర్ టెక్ మిషన్ ద్వారా డ్రైనేజి సమస్యను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. అంతే కాకుండా డ్రైనేజి లో పేరుకుపోయిన చెత్తాచెదారం ను తీసివేయాలని, పూడిక తీసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చేయాలనీ అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని పరిష్కరించేలా చూడలని, కాలనీ లో ఏ చిన్న సమస్య తలెత్తినా తన దృష్టికి వచ్చిన ఎడల పరిష్కరిస్తానన అన్నారు. ప్రజలకు ఎల్లా వేళల అందుబాటులో ఉంటానని, కాలనీల అభివృద్ధికి, డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు ఈ ఈ చిన్నా రెడ్డి, డీఈ రూప దేవి ,ఏఈ అనురాగ్ ,వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డిజిఎం నాగప్రియ, డిజిఎం నారాయణ మియాపూర్ డివిజన్ టీఆర్ఎస్‌అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.