మాదాపూర్‌, హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ల స‌మ‌స్య‌ల‌పై మంత్రి కేటీఆర్‌కు విన‌తి

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌, హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ల ప‌రిధిలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు కార్పొరేట‌ర్లు వి.పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ లు మంగ‌ళ‌వారం విన‌తిప‌త్రం అందజేశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్లు మాట్లాడుతూ.. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఆయా డివిజ‌న్ల ప‌రిధిల‌లో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ స‌మ‌స్య‌ల‌కు తెరాస ప్ర‌భుత్వంతోనే ప‌రిష్కారం ల‌భిస్తుందని అన్నారు.

మంత్రి కేటీఆర్‌కు స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తున్న కార్పొరేట‌ర్లు వి.పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

గోకుల్ ప్లాట్స్ సర్వే నెంబర్ 78, (సర్వే నెంబర్ 11/1 నుండి 11/34), అయ్యప్ప సొసైటీ, దోబీ ఘాట్ (11/38), సర్వే ఆఫ్ ఇండియా, చంద్ర నాయక్ తండా, ఆదిత్య నగర్, కృష్ణ కాలనీ, సుభాష్ చంద్ర బోస్ నగర్ (సర్వే నెంబర్ 80), సాయినగర్, యూత్ కాలనీ (సర్వే నెంబర్ 5, 6, 7, 8), గుట్టల బేగంపేట (సర్వే నెంబర్ 44, 45), నవభారత్ నగర్ (సర్వే నెంబర్ 63), ఖానామెట్, ఇజ్జ‌త్ నగర్, ఇజ్జ‌త్ నగర్ వీకర్ సెక్షన్ (సర్వే నెంబర్ 44/1, 44/12, 44/13), మైత్రి నగర్ ఫేస్ 3 (సర్వే నెంబర్ 366, 367), హుడా కాలనీ (ఈడబ్ల్యూఎస్) ల‌లో నివసిస్తున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

అలాగే ఖానామెట్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, అంబేద్కర్ భవన్ కోసం స్థలం కేటాయించాల‌ని, పర్వత నగర్ నుండి చంద్ర నాయక్ తండా మీదుగా హైటెక్ సిటీ వరకు, కాకతీయ హిల్స్ మసీద్ మీదుగా సున్నం చెరువు లింక్ రోడ్డు వరకు 40 ఫీట్ రోడ్డు నిర్మించాల‌ని, ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రీన్ బావ‌ర్చి హోటల్ నుండి కైదమ్మ కుంట‌ మీదుగా నేషనల్ హైవే వరకు రోడ్డు నిర్మాణం చేప‌ట్టాల‌ని వారు మంత్రి కేటీఆర్‌ను కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here