ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అనేక మంది టైప్ 1, 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. టైప్ 1 డయాబెటిస్ వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధి. టైప్ 2 డయాబెటిస్ అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల వస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్‌ను నిజానికి పలు చిట్కాలను పాటించడం ద్వారా అదుపులోకి తేవచ్చు. ఆ చిట్కాలు మీ కోసం…
* ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొంచెం దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని ఉదయం, సాయంత్రం వేళల్లో భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే టైప్ 2 డయాబెటిస్ కచ్చితంగా అదుపులోకి వస్తుంది.
* నిత్యం ఉదయాన్నే పరగడుపునే రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే పచ్చిగా నమిలి తినాలి. వెల్లుల్లిలో ఉండే అలియం సాటివం అనే సమ్మేళనం షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
* నిత్యం ఉదయాన్నే పరగడుపునే కొన్ని కరివేపాకులను అలాగే పచ్చిగా నమిలి తినాలి. రోజూ ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
* జామ ఆకులు కొన్నింటిని తీసుకుని నీడలో ఎండబెట్టాలి. అనంతరం వాటిని పొడి చేయాలి. తరువాత ఆ పొడికి కొద్దిగా జీలకర్ర పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో మరిగించి కషాయంలా చేసుకుని నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో తీసుకుంటే ఫలితం ఉంటుంది.
* పొడపత్రి ఆకులను సేకరించి నీడలో ఎండబెట్టి వాటిని పొడి చేయాలి. లేదా ఈ చూర్ణం నేరుగా మనకు మార్కెట్‌లో లభిస్తుంది. దాన్ని కూడా వాడవచ్చు. ఆ పొడిని నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగితే కొన్ని రోజులకు షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.