పారిశుధ్య కార్మికురాలి మృతి-బాధిత కుటుంబానికి మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మిక సంఘం ఆర్ధిక సాయం

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ పరిధిలోని ఆదిత్య న‌గ‌ర్‌లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికురాలు డి.లక్ష్మీ శుక్ర‌వారం తెల్లవారుజామున మృతిచెందింది. ల‌క్ష్మి మృతి ప‌ట్ల‌ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ- కార్మిక సంఘం ప్రగాఢ సంతాపం ప్రకటించింది. విధి నిర్వహణలో ప్రతి రోజు విధులకు హజరయ్యే కార్మికురాలు ఈ రోజు మన మద్య లేకపోవడం చాలా భాదాకరమని తెలంగాణ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మిక సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగేశప్ప అన్నారు. లక్ష్మి కుటుంబానికి సంఘం తరపున, ఆదిత్య నగర్ పెద్దల సహకారంతో రూ.15000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బిక్షపతి గౌడ్, శేరిలింగంపల్లి ఉపాధ్యక్షుడు రమేష్ నాయక్, సంజీవ్, లక్ష్మీ , కంసమ్మ, పారిశుధ్య కార్మికులు ఉన్నారు.

మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక‌ సహాయం అందజేస్తున్న మున్సిపల్‌ ‌ఔట్ సోర్సింగ్ ఉద్యోగ‌ కార్మిక సంఘం సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here