నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్లోని పాలపిట్ట పార్కులో శనివారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఎస్ఎఫ్డీసీఎల్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఛైర్ పర్సన్ గుడ్ల ధనలక్ష్మి మొక్కలు నాటారు. ఇంటింటికీ మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు స్వఛ్ఛమైన ప్రాణ వాయువును అందించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు భవాని చౌదరి, మాధవి, పార్వతీ తదితరులు పాల్గొన్నారు.