గురుపూర్ణిమ వేళ‌ శిల్పారామంలో అలరించిన వేణు గానాంజలి

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో గురుపౌర్ణిమ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నాద రమణీయం వేణు గాన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శేషం రమణ ఆధ్వర్యంలో వారి పూజ్య గురువులు కీ శే వి రమణ కు “వేణు గానాంజలి”ని సమర్పించారు. మొత్తం 26 మంది కళాకారులు ఈ సభలో పాల్గొని వేణుగానం చేసి ప్రకృతిని మైమరిపించారు. మహాగణపతిమ్, గురులేఖ, భజగోవిందం,అన్నమయ్య కీర్తనలు,రామదాసు కీర్తనలతో పాటు తదితర గానాలను వేణువు పై రాగాలతో పులకింపజేశారు. వేణుగానంతో అలరింపజేసిన కళాకారులను ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అభినందించారు.

నాదరమణీయం వారి వేణు గాన సభ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here