నమస్తే శేరిలింగంపల్లి: కరోనా బారిన పడి నలుగురు వ్యక్తులను కోల్పోయిన బాధిత కుటుంబానికి ఎస్సేవా ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. కళకళలాడిన కుటుంబంలో కరోనా విళయం… పేరిట జూన్ నెలలో నమస్తే శేరిలింగంపల్లిలో కథనం ప్రచురితమైన విషయం విధితమే. ఈ క్రమంలోనే ఇద్దరు కుమారులు, కోడలుతో పాటు భార్యను కోల్పోయిన బిహెచ్ఇఎల్ విశ్రాంత ఉద్యోగి రాములుకు పలువురు ఆర్థికంగా చేయూతనందించారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు బాసటగా నిలవాలని ఎస్సేవా ఫౌండేషన్ సభ్యులు ఎమ్.ఎ బేగ్ రాములు కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన లోటును ఎవ్వరూ తీర్చలేరని, మానవతా దృక్పథంతో తమవంతు సహయాన్ని అందజేసినట్లు బేగ్ అన్నారు.