గచ్చిబౌలి డివిజన్ బిజెపి కార్యవర్గ సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లో సోమవారం బిజెపి‌ డివిజన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, డివిజన్ ఇంచార్జీ కొత్త రవీందర్ గౌడ్ పాల్గొని మొదటగా భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించి భారత్ మాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డివిజన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని,‌బిజెపి బలోపేతానికి ప్రతి కార్యకర్త నడుంబిగించాలని పిలుపునిచ్చారు. బూత్ ఇంచార్జీలు పటిష్టంగా ఉండి శక్తి కేంద్ర ఇంచార్జీలతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, డివిజన్ ఇంచార్జ్ శంకర్, డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఐటీ సెల్ అధ్యక్షుడు రాహుల్, బిజెపి నాయకులు నీరుడి సురేష్ , రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రమేష్ సోమిశెట్టి, చెట్టి మహేందర్ గౌడ్, నరేందర్ ముదిరాజ్, శంలేట్ విజయ్ రాజు, సురేంద్ర ముదిరాజ్, సతీష్ గౌడ్ , అశోక్ ముదిరాజ్, తిరుపతి, ఆర్ వెంకటేష్, దయాకర్, రాఘవేంద్ర, సామ్రాట్ గౌడ్, రాఘవేంద్ర ముదిరాజ్, శివ గౌడ్, సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్, వసంత్ కుమార్ యాదవ్, శ్యామ్ యాదవ్, సంతోష్ సింగ్, హరీష్ శంకర్ యాదవ్, కిషన్ సింగ్, శివ ప్రసాద్, వరలక్ష్మి , ఇందిర , జై శ్రీనివాస్, ప్రవీణ్, దినేష్ , విజయ్, గుండప్పా, రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గచ్చిబౌలి డివిజన్ బిజెపి కార్యవర్గ సమావేశం లో పాల్గొన్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here