ఖానామెట్ భూములను కాపాడుకుంటాం: బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వేలం‌ పాట ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాలని‌ చూడడం సిగ్గుచేటని, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్ సర్వే నెంబర్ 41/14లోని స్మశానం వాటిక స్థలం వేలం పాటను కోర్టు ద్వారా స్టే‌ తెచ్చి అడ్డుకోవడంలో బిజెపి విజయవంతమైందని బిజెపి‌ రాష్ట్ర నాయకులు యం.రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. మసీద్ బండలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బిజెపి‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఖానామెట్ ప్రజల పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మశాన‌‌వాటిక స్థలాన్ని విక్రయించరాదని కోర్టు స్టే తీసుకురావడం‌ జరిగిందని రవికుమార్ యాదవ్ చెప్పారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని బిజెపి‌ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. న్యాయస్థానంలో పేద ప్రజలకు అనుగుణంగా తీర్పు వస్తుందని ఎట్టి పరిస్థితుల్లో స్మశాన వాటిక స్థలాన్ని వదులుకోబోమని రవి కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజెపి‌ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగా రెడ్డి,మాదాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధా కృష్ణ యాదవ్, నాయకులు నరసింహ యాదవ్ ఎల్లేష్, ప్రభాకర్ యాదవ్ గోవర్ధన్ గౌడ్, వినయ్, నరసింహ చారి , చక్రి, భారతీ కల్పన, పద్మ, ఇందిర, అరుణ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

మసీద్ బండలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here