బిజెపి మహిళ మోర్చా శేరిలింగంపల్లి కన్వీనర్ గా కొత్తపల్లి పద్మ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి మహిళా మోర్చా కన్వీనర్ గా నియమితులైన కొండాపూర్ కు చెందిన కొత్తపల్లి పద్మ నియమితులయ్యారు. శనివారం ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి పద్మకు నియామక పత్రం అందజేశారు. ఈ క్రమంలో పద్మ ఆదివారం శేరిలింగంపల్లి నియోజవర్గం మాజీ శాసనసభ్యులు ఎం.బిక్షపతి యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ లను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి‌ శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి రోజురోజుకు పుంజుకుంటుందన్నారు. మహిళా మోర్చా ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ బిజెపి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు మహేశ్వరి, నాయకురాళ్లు ఇందిరా, ఝాన్సీ , భారతి, అరుణ,స్వప్న రెడ్డి , కల్పన, రేణుక, నాగు బాయ్ తదితరులు ఉన్నారు.

భిక్షపతి యాదవ్, రవి కుమార్ యాదవ్ లతో పద్మ, తదితరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here