విద్యార్థుల‌కు చ‌దువులతోపాటు క్రీడ‌లు అవ‌స‌రం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

వివేకానంద‌న‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన TAIKA మార్షల్ ఆర్ట్స్ అకాడమీని ఎమ్మెల్సీ నవీన్ రావు, కూకట్‌ప‌ల్లి ఏసీపీ సురేందర్ రావు, సీఐ లక్ష్మీనారాయణ రెడ్డిల‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మన ప్రాంతంలో మన పిల్లలకు కరాటే, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటి క్రీడలలో అత్యున్నత ప్రమాణాలతో, అంతర్జాతీయ స్ధాయిలో పాల్గొనే విధంగా ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయ‌మ‌ని అన్నారు.

తైకా మార్ష‌ల్ ఆర్ట్స్ అకాడ‌మీని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

రాబోయే సంవత్సరంలో అంతర్జాతీయ వేదికలో పాల్గొని పథకాలు సాధించి పేరు ప్రఖ్యాతులు సాధించి కుటంబ సభ్యులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతగానో దోహదపడుతాయ‌ని అన్నారు. క్రీడల‌తో శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు. నిరంతర సాధన, కృషి, క్రమశిక్షణ, సడలని పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏమీ లేదని అన్నారు.

అకాడ‌మీలో బాక్సింగ్ చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

లక్ష్యం సాధించడం కోసం నిరంతరం కృషి చేయాలని గాంధీ అన్నారు. అదేవిధంగా చిన్నారులలో దాగిన నైపుణ్యాన్ని గుర్తించి ఆ దిశ‌గా ప్రోత్సహించడం ద్వారా వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి తలిదండ్రులు, సమాజానికి మంచి పేరు తీసుకువ‌స్తార‌ని అన్నారు. అదేవిధంగా పిల్లలకు చదువులతోపాటు వారికి ఏ కళ‌లో ప్రావీణ్యం ఉందో ఆ దిశగా ప్రోత్సహించి వారి విజయాలకు కృషి చేయాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా యజమాని అశోక చక్రవర్తిని గాంధీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగా రావు, తెరాస నాయకుడు నాయి నేని చంద్రకాంత్ రావు, ఆదిత్య, కాలనీ అధ్యక్షుడు భీమ్ రావు, దేవినేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అకాడ‌మీ య‌జ‌మానులు, చిన్నారులతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here