భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించడమే లక్ష్యం: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురా నగర్ లో ఎనిమిదో రోజున పట్టణ‌ ప్రగతిని జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నిర్వహించారు. మధురానగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో మొక్కలను నాటారు. కాలుష్య రహిత సమాజ స్థాపనకు మొక్కలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పట్టణ ప్రగతిని ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులతో, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలసి పరిసర ప్రాంతాలలోని చెత్తను, మట్టి కుప్పలను తొలగించారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు.

మ‌ధురాన‌గ‌ర్ ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి, స్థానిక నేత‌లు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ వీణా రెడ్డి, జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, చెట్టి మహేందర్ గౌడ్, నీలం సురేందర్, జిల్లా నాయకులు స్వామి గౌడ్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు నరేందర్ ముదిరాజ్ , రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, ఆర్ వెంకటేష్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు నక్క శివ కుమార్, గచ్చిబౌలి డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సంజీవ, ఎస్ సీ మోర్చా జనరల్ సెక్రటరీ గోపాల్, శంలేట్ రాజు, గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ షర్మిల , లెక్చరర్స్ జంగయ్య, వసంత, రాజశేఖర్ , ఆఫీస్ స్టాఫ్ ప్రసాద్, లక్ష్మీ, సీనియర్ నాయకులు వెంకటేష్, దయాకర్, శివ సింగ్ , రాఘవ రావు , ఇందిర , వరలక్ష్మి , శంకర్ యాదవ్ , రమేష్, చెట్టి నరసింహ , ప్రవీణ్ , నర్సింగ్ రావు, జి.హెచ్.ఎం.సి శానిటేషన్ సూపర్వైజర్ శ్రీనివాస్, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌ధురాన‌గ‌ర్‌లో బిజెపి మ‌హిళా మోర్చ ఆద్వ‌ర్యంలో చేప‌ట్టిన హ‌రితహారంలో మొక్క‌లు నాటుతున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here