నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రెండు ఆలయాలను స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి గురువారం సందర్శించారు. రాయదుర్గంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, అదేవిధంగా మధురానగర్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ, ఆంజనేయస్వామిల ఆశీస్సులతో కరోనా పూర్తిగా దూరమై డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో సంపూర్ణంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమమాలలో రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు వీణా రెడ్డి, జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ చారి, చెట్టి మహేందర్ గౌడ్, నీలం సురేందర్, స్వామి గౌడ్, నరేందర్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి, హనుమంతు నాయక్, నాగినేని కృష్ణవేణి, శ్రీదేవి రెడ్డి, వినిత సింగ్, చిలుకూరి మహేశ్వరి, పద్మ, పూజ, వెంకటేష్, తిరుపతి, నక్క శివ కుమార్, సంజీవ, గోపాల్, శంలేట్ రాజు, రాఘవేంద్ర, వెంకటేష్, దయాకర్, శివ సింగ్, రాఘవ రావు, ఇందిర, వరలక్ష్మి, సావిత్రి, సరోజ రెడ్డి, సంతోష్ రెడ్డి, శంకర్ యాదవ్ , రమేష్, చెట్టి నరసింహ, ప్రవీణ్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

