నమస్తే శేరిలింగంపల్లి: ఇతరుల కళ్లలో ఆనందం కోసం తమకు నచ్చిన వస్తువును త్యాగం చేయడం ఎంతో గొప్ప విషయం. అలాంటిది శరీరంలోని ఒక అంశాన్ని అవతలి వారికి దానం చేయాలంటే గొప్ప మనసు ఉండాలి. అలాంటి మంచి మనసున్న అమ్మాయే సాహితి గౌడ్. చందానగర్ హుడా కాలనీలో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి స్వాతి గౌడ్ కూతురు సాహితి గౌడ్. మదీనగుడ జెనిసిస్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతుంది. చదువులో చురుకుగా ఉండే సాహితి చిన్నప్పటి నుంచే సామాజిక సేవ పట్ల ఆసక్తి చూపిస్తుంటుంది. ఈ క్రమంలోనే తన తల్లి ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజు నాడు అనాథ అశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో భోజనం పంపిణీ, ఇతర సేవ కార్యక్రమాలు చేస్తు వచ్చేది. ఐతే ఈ ఏడాది కరోనా కారణంగా అలాంటి సేవ చేయలేని పరిస్థితి. ఏదేమైన ఒక గొప్ప సేవ చేయాలని అనుకుంది సాహితి. తన మేనమామ ప్రణీత్ గౌడ్‌తో తన ఆవేదనను వ్యక్త పరిచింది.
దీంతో ప్రణీత్ గౌడ్ క్యాన్సర్ బాదితులకు తన జుట్టును దానం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. తనకు ఎంతో ఇష్టమైన జుట్టును పూర్తిగా కత్తిరించుకోడానికి మొదట సాహితి కొంత ఆలోచనలో పడింది. ఐతే క్యాన్స్‌ర్ ట్రీట్‌మెంట్ క్రమంలో జుట్టు ఊడిపోయి బాదలో ఉండే క్యాన్సర్ బాదితల ఆవేదనను అర్థం చేసుకున్న సాహితి గొప్ప నిర్ణయం తీసుకుంది. తన పొడవాటి జుట్టును కత్తిరించుకుని హీలింగ్ హార్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కొప్ విత్ క్యాన్సర్ – మదత్ చారిటబుల్ ట్రాస్ట్‌కు దానం చేసింది. ఈ సందర్భంగా మదత్ ట్రస్ట్ వారు సాహితి గౌడ్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేసింది. సాహితి నిండు మనసుకు స్థానికులు, బంధువులు, నెటిజెన్ల నుంచి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. చిన్నతనం నుంచే ఆమెలో సేవాబావాన్ని పెంపొందించిన తల్లి స్వాతి గౌడ్‌కు జేజేలు పలుకుతున్నారు. సాహితి లాగే తమ జుట్టును క్యాన్సర్ బాదితుల కోసం దానం చేయాలనుకునే వారు ఫోన్ నెంబర్ 7815916028లో సంప్రదించగలరు.