నమస్తే శేరిలింగంపల్లి:మియాపూర్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో ఆదర్శవంతమైన డివిజన్ గా రూపొందిస్తానని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీ లో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ మెయిన్ రోడ్డు పక్కన గల నాల పై ఫ్రీ క్యాస్టింగ్ స్లాబ్ పనులను మంగళవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. ఆయన వెంట ఏఈ ధీరజ్, వర్క్ ఇన్ స్పెక్టర్ జగన్, విశ్వనాథం, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి చంద్రిక ప్రసాద్ గౌడ్ , కాలనీ అధ్యక్షుడు కిషోర్ ,అశోక్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.