- ఎక్కడికక్కడ నిర్మానుష్యంగా మారిన రహదారులు
- నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా ముగిసిన వివాహాలు
- లాక్‌డౌన్ తీరును పరిశీలించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో మొదటిరోజు లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 10 గంటల వరకు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, వైన్‌షాపులు ముతపడ్డాయి. అక్కడక్కడా కొంత ఆలస్యం జరిగినప్పటికి తొలిరోజు కావడంతో పోలీసులు నచ్చచెప్పి వదిలేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తు పలుచోట్ల వివాహ వేడుకలు నిడారంబరంగా ముగించారు. ప్రభుత్వ దవఖానాల వద్ద వ్యాక్సినేషన్ కోసం ప్రజలు బారులు తీరారు. నాలుగు గంటలు మాత్రమే విక్రయాలు జరిగిన నేపథ్యంలో వైన్స్ షాపుల వద్ద మందు బాబులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ.సజ్జనార్ హైటెక్‌సిటీతో పాటు కమిషనరేట్ పరిధిలోని పలు ముఖ్య చౌరస్థాల వద్ద లాక్‌డౌన్ తీరును పరిశీలించారు. లాక్‌డౌన్ నిబంధనలను విధిగా పాటించాలని, ఉల్లంఘించినవారిని ఉపేక్షించవద్దని కిందిస్థాయి అధికారులకు సూచించారు.